Friday, February 21, 2020

Flower Star Pawan Kalyan Punch Dialogues Compiled by Truth & Vision

Real Facts about Pawan Kalyan : Truth and Vision Comment -2

Image result for pawan kalyan 11 rojuli annem manesanu

1). పవన్ కళ్యాణ్ భీమవరంలో, గాజువాక లో పోటీ చేశాడు. దానికి కారణం మీరు చెప్పగలరా?

2). మీరేం చెప్తారు అంటే రాజ్యాంగం హక్కు కల్పించింది. ఎవరైనా ఎక్కడనుంచైనా పోటీ చేయవచ్చు అంటారు. ఓకే. రాజ్యాంగం రెండు చోట్ల అని చెప్పింది కాబట్టి పవన్ రెండు చోట్లా పోటీ చేశాడు. లేదంటే అన్ని నియోజకవర్గాలు ఆయనవే.. !

3). మరి పీకే గారికి సొంత ఊరు పైన గాని, చదువుకొని పెరిగిన ఊరు పైన గాని నమ్మకం లేదు.
ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే...!

4). నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మంచివాడే. గుణం మాత్రమే సరైంది కాదు..
కానీ ప్రజలు గుణాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు...

5). ఇంకో విషయం.. ఇతని చుట్టూ తిరిగే కొంతమంది చదువుకున్న సన్నాసులు కూడా ఇతనికి భజన చేస్తున్నారు. వాళ్ళు ఇతని  కన్నా పెద్ద వెర్రి వెంగళప్పలు..

6). కులాన్ని అడ్డం పెట్టుకుని పోటీ చేయడం కాదురా వెర్రివెంగళప్పలారా..  వాళ్లు అన్నదమ్ములు పుట్టిన ఊరికి ఏం చేశారు అడగండి?? మొగల్తూర్ లో ఉన్న పాత బిల్డింగ్ చూపించి, జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు స్వార్థపరులు...

7). చిరంజీవి గారి కూతురికి ఉదయ్ కిరణ్ అనే యాక్టర్ తో నిశ్చితార్థం అయితే, పవన్ కళ్యాణ్ ---  వాడు వేరే కులం అని పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చెయ్ పిచ్చి, ఇండస్ట్రీలో సినిమాలు కూడా లేకుండా చేసి వాడు ఆత్మహత్య చేసుకునే దానికి కారణం వీడు కాదా?? ఇప్పుడు మాత్రం కులాలకు మతాలకు అతీతమా?? ఈ విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసిందే...

8). నిజం చెప్పాలంటే చిరంజీవి గారు లో ఉన్న విధేయత, ఆలోచించి మాట్లాడడం, ఎప్పుడు ఎలా స్పందించాలి, సమాజంలో ఎలా మెలగాలి, సభ్యత, సంస్కారం, ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి, ఎదుటి వారి వయసును గౌరవించే గుణ లక్షణాలు పవన్ కళ్యాణ్ కి 1 శాతం కూడా లేదు..

9). పవన్ కళ్యాణ్ --- మాత్రం మూడు జాతులకు సంబంధించిన వాళ్లని  పెళ్లి చేసుకోవచ్చా??? ఇతను చేస్తే సంసారం, వాళ్లు  పెళ్లి చేసుకుంటే వ్యభిచారమా???

ఇతనికి సపోర్ట్ చేసే వాళ్ళకి సిగ్గు లజ్జా ఉండాలి..
ఇదే పరిస్థితి మీ అక్క కో, చెల్లి కో జరుగుంటే తెలిసి ఉండేది...

10). పవన్ కళ్యాణ్ కి రెండు గ్లాసులు పగిలిన ఇంకా బుద్ధి రాలేదు. మార్పు మార్పు మార్పు అంటూ మంచి మార్పు తెచ్చాడుగా.  పోలవరం ఆగిపోయింది, అమరావతి కోమాలోకి వెళ్ళిపోయింది, ఆకలి తీర్చే క్యాంటిన్లు మూతపడ్డాయి,
ప్రజలు ఆకలి చావులు చస్తుంటే ప్రభుత్వానికి మూడు నెలలు టైం ఇస్తానని చెప్పిన ఈ అనుభవజ్ఞుడు..!!!
25 ఏళ్ల యువత భవిష్యత్తు అంటూ
ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకు పోయాడు.
చంద్రబాబు గారి పాలన అవినీతి పాలన అని నిందలు వేస్తూ ఒక్క స్టెప్ తో కింగ్ మేకర్ సీఎం అయిపోదామని పగటి కలలు కన్నాడు. స్థిమితం లేని మనిషి. సిద్ధాంతం లేని పార్టీ. ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ. ఎవడో చెప్తే విన్నాను అని నిరాధార ఆరోపణలు చేస్తాడు.
కట్టుకున్న దానికి జీవితాంతం జీవితాన్ని ఇవ్వలేనోడు ప్రజలకు జీవితాంతం సేవ చేస్తాడంట! సేవ చేయాలంటే అధికారం అవసరం లేదు. మానవత్వం ఉండాలి. మంచికి, గుణానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
ఇతని చుట్టూ తిరిగే కొంతమంది జనాలు, అధికారం దొరికితే ఇతన్ని అడ్డంపెట్టుకుని దోచుకుందాం అనుకుంటున్న వాళ్లే.. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు..!!
ఇతనికి టైం కుదిరినప్పుడు మాత్రం ప్రశ్నిస్తాడు, ప్యాకేజీ దొరికితే చాలు ప్రత్యేక హోదా పక్కన పెట్టేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. ఇతన్ని మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదు. అది ఈయన "సిద్ధాంతం".!
ఇది నిజం..

Truth and Vision Comment on Pawan Kalyan ఏపీపై కమల హాస్యం! పవన జోస్యం!! -1

Truth and Vision Comment
Image result for pawan kalyan 11 rojuli annem manesanu
ఏపీపై కమల హాస్యం! పవన జోస్యం!!

1) ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి, ఆ కూతలే కూస్తాయి అనేది ఎంత నిజమో, ప్రశ్నించే పార్టీగా పుట్టిన పవన్ పార్టీ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బీజేపీతో కలిసి ఉన్నంతకాలం చంద్రబాబుని పొగుడుతూ, ప్రత్యేక హోదా విషయంలో యువతను రెచ్చగొడుతూ, మీకు చేతకాకపోతే రాజీనామాలు చేయండి అంటూ ఎంపీలపై కేంద్ర మంత్రులపై విరుచుకుపడుతూ మోదీని పల్లెత్తు మాట అనకుండా దత్త పుత్రులు వ్యూహాత్మకంగా ఆడిన నాటకం కూడా అంతే నిజం!

2) మోడీ చేసిన మోసానికి ఎప్పుడైతే బిజెపిని వీడి బయటకు వచ్చారో, మరుక్షణమే పవన్ గొంతు మార్చి కూసిన పిచ్చి కూతలు ప్రజలు మర్చిపోలేదు. తన పార్టీ ఆవిర్భావ సభ రోజు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాడో చెప్పకుండా చంద్రబాబుపై తన స్థాయికి మించి నిరాధార అవినీతి ఆరోపణలు చేయడం, ఆయన వయసుకు, ఆయనకున్న అపారమైన అనుభవానికి కూడా మర్యాద ఇవ్వకుండా నిందించటం, అదే ముసుగులో అమరావతికి భూములు ఇచ్చిన రైతులను తప్పుదారి పట్టించడం, కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అండదండలతో విర్రవీగి పోయాడు.

3) ప్రజలకు బీజేపీపై ఉన్న వ్యతిరేకత వల్ల వ్యూహంలో భాగంగానే ఆరోజు ఒంటరిగానే పోటీ చేసి కింగ్ మేకర్ కలలుకన్నాడు. వచ్చేది జనసేన ప్రభుత్వమే. ఒక్కొక్కడిని గుర్తు పెట్టుకుంటున్నా. ఎవడిని వదలను అనే జబర్దస్త్ డైలాగులతో చిందులు వేస్తూ, ఆవేశంతో ఊగి పోతూ, తల తోక అనే ఒక సిద్ధాంతం కూడా లేకుండా 25 సంవత్సరాల యువత భవిష్యత్తు కోసం వస్తున్నాను అని ప్రగల్భాలు పలికి, భావితరాల భవిష్యత్తును 20 ఏళ్లు వెనక్కి నెట్టి వేసిన పాపం లో ఇతడు కూడా భాగస్వాముడే!

4) తెరపైన గంతులేసే నటుడు వస్తే ఒక సారి చూడాలని ప్రజలు వస్తారు. అంతమాత్రాన సీఎం అయిపోతాను అనుకోవడం భ్రమ మాత్రమే! దేశ ప్రధాని వస్తే అనేకమంది జనం వస్తారు. అంతేకాదు సన్నీ లియోన్ వచ్చిందంటే అంత కంటే పది రెట్లు జనం వస్తారు. అలాగని ఆమె ప్రధానమంత్రి అయిపోతుందా?? సందుల్లోనూ బొందుల్లోనూ బ్రిడ్జి పైన కవాతులు చేస్తే ట్రాఫిక్ జామ్ అయి ఇసకేస్తే రాలనంతలా కనిపిస్తుంది!

5) పవన్ కోసం చెప్పాలంటే ఇతను పిరికివాడు.
ఎవరైనా సపోర్టు లేకపోతే నోటి నుంచి మాటలు రావు.
చంద్రబాబు సున్నిత మనస్కుడు కాబట్టి ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతాడు. తోలు తీసే నాయకులు దగ్గర భయముతో కూడిన భక్తి మర్యాదలు ప్రదర్శిస్తాడు.
ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒక చిన్న కుక్క పిల్ల దానిని పెంచే యజమాని ప్రక్కన ఉంటే రోడ్డులో పోతున్న జనాన్ని చూసి బౌ బౌ బౌ బౌ అని తెగ చిందులు వేసేస్తాది. అదే ఎవరూ లేకపోతే తోక ముడుచుకుని మూలన కూర్చుంటుంది. జరుగుతున్న పరిణామాలకు ఇది అద్దం పడుతుంది!!

6) మీరు గమనించండి, పవన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక నిమిషానికి 120 సార్లు కనురెప్పలు ఆడిస్తాడు. గతంలో 60 నుండి 70 వరకు ఉండేది. ఇప్పుడది రేటింగ్ బాగా పెరిగింది. ఇది అధికారం కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాను అనే తడబాటుకు చిహ్నం లాంటిది! అందరికీ వాళ్ళ గురువు అయిన మోదీ గారి అంత అనుభవం ఉండదు కదా! సూటిగా చూస్తూ సమాధానం చెప్పలేరు. ఇకనుండి బిజెపి వ్రాసి ఇచ్చిన స్క్రిప్ట్ పీకే చదవాల్సిందే!

7) సినిమాల్లో పవర్ స్టార్ ని ఏమో గాని రాజకీయాల్లో అట్టడుగు లో ఉన్నాను అని చెప్పిన పవర్ లేని పవర్ స్టార్ ఇప్పుడు మాస్కు తీసివేసి ఆంధ్ర ప్రదేశ్ కి ఆంధ్రులకు ద్రోహం చేసిన వాళ్లతో జగన్ లాగానే చేతులు కలపడం, అమరావతి అనే మాస్క్ వేసుకుని పవర్ ఉన్న పార్టీతో జత కట్టడం, ఆంధ్రప్రదేశ్ కు మంచి జరుగుతుంది అని అనడం కమల హాస్యంతో  పవన్ జోస్యం చెబుతుంది!

8) మూడు రాజధానుల ప్రకటన వెలువడక ముందే ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలను కలిసి వచ్చి, నెల రోజుల నుండి రైతులు ఆందోళన చేస్తుంటే పట్టించుకోకుండా, అన్ని పార్టీలు కలిసి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తుంటే ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ గంగా ప్రక్షాళన చేయలేని వారితో, రాజకీయ ప్రక్షాళన అంటూ వ్యూహాత్మక రాజకీయాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ప్రత్యేక హోదా కోసం విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈయన కూడా మడమ తిప్పడం లో మేధావి అయ్యాడు!

9) మూడుముక్కలాట వ్యూహరచన ద్వారా ప్రజాదరణ లేని బిజెపి మీటింగ్ లకు కొద్దో గొప్పో జనాలు రావాలంటే, ఎక్కువ మంది ఓటు హక్కు లేని పవన్ అభిమానులు చాలు! ఈ వంక పెట్టుకొని మేమే అమరావతిని కాపాడాం! ఇది ఒక బీజేపీతోనే సాధ్యం అనే బాకాలు ఊదడానికి వేసిన రాజకీయ ఎత్తుగడ. అధికారం కోసం ఒకరు, బెయిల్ రద్దు కేసుల భయంతో మరొకరు ఎలా ఆడమంటే అలా ఆడే ఈ దత్తపుత్రులు, కొమ్ముకాసే వ్యవస్థలు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశంలో చక్రం తిప్పుతూనే ఉంటారు!